హైదరాబాద్‌లో డ్రగ్స్ భూతం విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు ఈ దందాలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ కేటుగాళ్లు ఏమాత్రం మారడం లేదు. కొత్త పుంతలు తొక్కుతూ నగరంలోకి మాదకద్రవ్యాలను తీసుకొస్తున్నారు. డ్రగ్స్ తీసుకొస్తున్న కేటుగాళ్ల నెట్‌వర్క్ చూసి పోలీసులే విస్తుపోతున్నారు.
ఇప్పటికే ఓసారి హైదరాబాద్‌లోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కలకలం రేపాయి. బడాబాబులు ఈ వ్యహారంలో తెరపైకి వచ్చారు. ఇప్పడు మరోసారి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. దీని వెనుక బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఉండడంతో మరోసారి సంచలనంగా మారింది.
READ MORE : Click Here