గాజువాకలో గెలవాలంటే చెమటోడ్చాల్సిందే..

 ఏపీలో రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గంగా.. విశాఖపట్నం లోక్ సభ స్ధానం పరిధిలో ఉన్న గాజువాక గురించి చెబుతారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా.. గాజువాక ఏర్పడింది.అప్పటి నుంచి గాజువాకలో జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ  రాజకీయ పార్టీలకు మిశ్రమ ఫలితాలు ఇస్తూ హాట్ టాపిక్ గా నిలవడం ఈ నియోజవర్గం ప్రజల స్పెషాలిటీగా మారిపోయింది.  2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసి..ఓడిపోవడంతో ఈ నియోజకవర్గం పేరు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది.


గాజువాక అసెంబ్లీ స్థానం రూరల్ నియోజకవర్గం.ఈ నియోజకవర్గంలో 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా కాపు, బీసీ సామాజిక వర్గాల హవా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. గాజువాక ,పెద గంట్యాడ మండలాలు ఈ అసెంబ్లీ సీటు పరిధిలోనే ఉన్నాయి.  నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత 2009లో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో..చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన చింతలపూడి వెంకట్రామయ్య విజయం సాధించారు.

READ MORE : Click Here

Post a Comment

Previous Post Next Post