జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన కలిసి రిలీజ్ చేసిన తొలి జాబితాలో.. జనసేనకు కేటాయించిన 24 సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న స్థానాన్ని పవన్ ప్రకటించకపోవడం తాజాగా హాట్‌టాఫిక్ అయింది.ఇటీవల భీమవరంలో పర్యటించిన పవన్ కల్యాణ్ అక్కడి టీడీపీ, బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. తాను భీమవరం నుంచి పోటీ చేస్తున్నాననే సంకేతాలను ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి బరిలోకి దిగితే తామంతా సహకరిస్తామని టీడీపీ నేతలు కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేన నేతలు కూడా తమ పార్టీ అధినేత భీమవరం నుంచి పోటీ చేస్తున్నారంటూ ప్రచారం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని అంతా అనుకున్నారు.
READ MORE : Click Here