మొత్తానికి తెలుగు దేశం-జనసేన పార్టీలు స్పీడ్ పెంచేశాయి. సీట్ల సర్దుబాటుపై ఓ క్లారిటీ ఇచ్చి.. తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించాయి. ఈసారి 24 అసెంబ్లీ.. 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన సోటీ చేస్తోంది. ఈ మేరకు 24 స్థానాల్లో 5 స్థానాలకు జనసేనాని పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ఖరారు చేశారు.
మిగిలిన స్థానాలకు కూడా అతి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు. అటు మిగిలిన స్థానాల్లో టీడీపీ బరిలోకి దిగుతోంది. ఈక్రమంలో 94 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించేశారు. త్వరలోనే మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే బీజేపీ కూడా కూటమితో జతకట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే మరోసారి సీట్లను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.READ MORE : Click Here