రాజకీయ నాయకులను వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

 రోడ్డు ప్రమాదాలు ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటున్నాయి. వారి కుటుంబాల్లో విషాదాలను మిగుల్చుతున్నాయి. మన దేశంలో ప్రతీ గంటకు సగటున 50 మంది రోడ్డు ప్రమాదాలకు బలి అవుతున్నారు. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం.. నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. 



ఇటీవలకాలంలో రాజకీయ నాయకులను రోడ్డు ప్రమాదాలు వరుసగా వెంటాడుతున్నాయి. వారిని కలవరపెడుతున్నాయి. గతంలో టీడీపీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ, వైసీపీ నేత భూమా శోభానాగిరెడ్డి.. కొద్దిరోజుల క్రితం ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించారు. ఇప్పుడు యవనేత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను కూడా రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది.

READ MORE : Click Here

Post a Comment

Previous Post Next Post