రాజమండ్రి రూరల్‌లో బుచ్చయ్య చౌదరి పోటీ

 పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీతోనే ఉన్న సీనియర్ రాజకీయవేత్త గోరంట్ల బుచ్చయ్య చౌదరి..  చివరకు పంతం నెగ్గించుకుని రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ నుంచి  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కందుల దుర్గేష్ జనసేన నుంచి పోటీ చేయబోతుండగా.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అదే స్థానంపై పట్టుపట్టుకుని కూర్చున్నారు.



ఇదే విషయంపై బుచ్చయ్య చౌదరి టీడీపీ అధినేత చంద్రబాబుతో  మంతనాలు జరపగా..చివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను దీనిపై ఒప్పించారు. దీంతో అక్కడ  నుంచి  పోటీ చేయడానికి బుచ్చయ్య చౌదరికి లైన్ క్లియర్ అయినట్లు అయింది.  జనసేన పార్టీ నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగడానికి రెడీ అవుతున్న కందుల దుర్గేష్‌ను.. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జనసేన పార్టీ హైకమాండ్ కోరింది.


READ MORE : Click Here

Post a Comment

Previous Post Next Post